Driving License

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి

డ్రైవింగ్ లైసెన్స్ కొరకు – ముందుగా Learner License కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ వెబ్ సైట్ https://parivahan.gov.in 
తెలంగాణా వెబ్ సైట్ https://www.transport.telangana.gov.in/html/driving-licence.html

దీనిలో పైన ఆన్లైన్ సర్వీసెస్  అని ఉంటుంది. క్లిక్ చేయాలి.

Driving License Related Services అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దిగువన మీయొక్క స్టేట్ ను సెలెక్ట్ చేయాలి. Apply for Learner License పై క్లిక్ చేయాలి. స్టేజెస్ అనేవి ఉంటాయి కంటిన్యూ పై క్లిక్ చేయాలి. కేటగిరి లో జనరల్ సెలెక్ట్ చేయాలి. కొత్తగా అప్లై చేస్తున్న వారైతే Applicant does not hold any Driving/Learner licence issued in India పై టిక్ చేయాలి. సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

ఆధార్ నెంబర్ పై టిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ కు మొబైల్ నెంబర్ కచ్చితంగా లింక్ అయి ఉండాలి. బాక్స్ లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓ.టి.పి పై క్లిక్ చేయాలి. దిగువున మీ మొబైల్ కు వచ్చిన ఓ.టి.పి ఇచ్చి దిగువ ఉన్న 3 బాక్స్ పై టిక్ చేసి అథంటికేట్ పై క్లిక్ చేయాలి.

వెంటనే మీ ఫోటోతో సహా మీయొక్క వివరాలు కనిపిస్తాయి. డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని ప్రొసీడ్ పై క్లిక్ చేసి, ఒకే పై క్లిక్ చేయాలి. రిలేషన్ ఫాదర్ సెలెక్ట్ చేసి, ఫాదర్ నేమ్ ను ఇవ్వాలి. అలాగే ప్లేస్ అఫ్ బర్త్, మీ క్వాలిఫికేషన్, మొబైల్ నెంబర్, మోల్స్ – స్టార్ ఉన్న అన్నీ వివరాలు ఇవ్వాలి. ప్రెసెంట్ అడ్రస్ లో సేమ్ as ఆధార్ పై టిక్ చేస్తే అడ్రస్ మొత్తం ఆటోమేటిక్ గా వచ్చెస్తుంది. అలాగే పర్మినెంట్  అడ్రస్ సేమ్ అయితే సేమ్ as ప్రెసెంట్ అడ్రస్ పై టిక్ చేస్తే ప్రక్కన ఉన్న అడ్రస్ మొత్తం ఆటోమేటిక్ గా వచ్చెస్తుంది

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి

Apply For Driving License Detailed Video Link Click Here

Duration of stay at Present Address.. ఈ అడ్రస్ లో మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారో ఇవ్వాలి, వెహికల్ వివరాలు ఇవ్వాలి. స్కూటీ వాడుతున్న వారైతే motor cycle without gear సెలెక్ట్ చేయాలి లేదా గేర్స్ ఉన్న బైక్  వాడుతున్న వారైతే  motor cycle with gear  సెలెక్ట్ చేయాలి 4 వీలర్ కి అయితే  లైట్ వెహికల్ సెలెక్ట్ చేసి సింబల్ పై క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసింది రైట్ సైడ్ కి వస్తుంది.

సెల్ఫ్ డిక్లరేషన్ పై క్లిక్ చేస్తే పాప్ ఓపెన్ అవుతుంది.  అన్ని చదివి టిక్ చేయండి. మొదటిది ఎస్ , రెండవది నో మిగతా అన్ని యస్ ఇచ్చి దిగువున బాక్స్ పై టిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేయాలి.  సెల్ఫ్ డిక్లరేషన్ సక్సెస్స్ అవుతుంది వెంటనే బ్యాక్ పై క్లిక్ చేయాలి. మొదటిది యస్ పై టిక్ చేస్తే పాప్ ఓపెన్ అవుతుంది మీయొక్క వివరాలు కనిపిస్తాయి.

ఈ అప్లికేషన్ నెంబర్ ను ఎక్కడైనా నోట్ చేసుకోండి. దిగువ ఉన్న నెక్స్ట్ పై క్లిక్ చేయాలి డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని అప్లోడ్ డాకుమెంట్స్ పై టిక్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ ఉంటుంది  సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

డాకుమెంట్స్ లో అడ్రస్ ప్రూఫ్ సెలెక్ట్ చేయాలి. ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డ్  సెలెక్ట్ చేయాలి DOC No. దగ్గర ఆధార్ నెంబర్ టైపు చేయాలి.
Issued by దగ్గర UIDAI అని ఇవ్వాలి అలాగే Issued date దగ్గర ఆధార్ కార్డ్  లో Issued date ఉంటుంది ఆ డేట్ ను టైపు చేయాలి.

కాంటాక్ట్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ను ఇవ్వాలి. ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ స్కాన్ చేసి పిడిఎఫ్ లో అప్లోడ్ చేయాలి.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి

ఆధార్ పిడిఎఫ్ ను అప్లోడ్ చేయడం కోసం Choose file పై క్లిక్ చేసి అప్లోడ్ పై క్లిక్ చేయాలి. ఫైల్ అప్లోడ్ అయ్యాక conform పై క్లిక్ చేయాలి.Fee Payment పై టిక్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి.

అక్కడ పేమెంట్ ఎంత కట్టాలో చూపిస్తుంది. దిగువున పేమెంట్ option లో CFMS AP STATE సెలెక్ట్ చేయాలి. ప్రక్కన ఉన్న Captcha code టైప్ చేసి buy now పై క్లిక్ చేయాలి. I agree పై టిక్ చేసి Proceed Fee Payment పై క్లిక్ చేయాలి. Online payment సెలెక్ట్ చేయాలి. అక్కడ Pay U ను సెలెక్ట్ చేయాలి.

Credit card, Debit card , UPI  దేనితో అయిన పేమెంట్ చేయవచ్చు. Payment success అయ్యాక ఆ పేజ్ లో status అనేది success అని చూపిస్తుంది Click here for Print Receipt పై క్లిక్ చేయాలి. వెంటనే Payment e receipt చూపిస్తుంది. డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి.

మరలా హోం పేజ్ ఓపెన్ చేయాలి దానిలో complete your pending application పై క్లిక్ చేయాలి దానిలో అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ captcha code ఇచ్చి సబ్మిట్ చేయాలి. దిగువున LL Slot Book అని ఉంటుంది. దీనిపై టిక్ చేసి proceed పై క్లిక్ చేయాలి. దిగువున ఉన్న  proceed to book పై క్లిక్ చేయాలి.

గ్రీన్ కలర్ ఉన్న తేదీలు available గా ఉన్నట్లు కనుక మీకు వీలైన తేదీని సెలెక్ట్ చేసి ప్రక్కన ఏ టైం కి వెళ్ళగలరో ఇవ్వాలి. దిగువున ఉన్న  book Slot పై క్లిక్ చేయాలి. వెంటనే మీ మొబైల్ కు ఒటిపి వస్తుంది. ఒటిపి ని ఎంటర్ చేసి Conform to Slot book పై క్లిక్ చేయాలి. వెంటనే మీకు అపాయింట్మెంట్ రిసీప్ట్ వస్తుంది దీనిని ప్రింట్ తీసి ఉంచాలి. ఈ విధంగా మీరు Learner licence  కోసం అప్లికేషన్ ఫిల్ చేయాలి

Learner licence Test at RTO Office:

Learner licence  అపాయింట్మెంట్ బుక్ చేసుకొన్న డేట్ లో  మీరు RTO Office కు వెళ్లి Learner licence  టెస్ట్ రాయాల్సి వుంటుంది  మీరు టెస్ట్ కి వెళ్ళేటప్పుడు ఈ డాకుమెంట్స్ తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి

  1. Aadhar Card Xerox & Original Aadhar Card
  2. Payment Receipt
  3. Printed Application
  4. Provisional Appointment for Learner Licensee test

పై ప్రోఫోర్మాస్ ఒకవేళ మీరు ప్రింట్ తీయడం మరచిపోతే ఎం ప్రాబ్లం లేదు. ఇదే పేజి లో print application forms పై క్లిక్ చేసి దీనిలో అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఇచ్చి మీకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

RTO Office లో Learner licence టెస్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే!

మీరు RTO Office కు వెళ్ళేటప్పుడు ఈ డాకుమెంట్స్ తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి ఈ డాకుమెంట్స్ వారు వెరిఫై చేస్తారు RTO Office వారు వెరిఫికేషన్ పూర్తి అయిన వెంటనే మీ మొబైల్ కు verified successfully అని మెసేజ్ వస్తుంది.అలాగే మీ అప్లికేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ కుడా ఇంకో మెసేజ్ వస్తుంది. వెంటనే RTO Office స్టాఫ్ మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. Questions  అన్ని Multiple Questions  లో వుంటాయి.ఈ టెస్ట్ కు ముందుగా ప్రేపేర్ అవ్వడం బెటర్. ముందుగా ప్రేపేర్ అవ్వడం వలన Questions  అన్ని ఈజీ గా ఆన్సర్ చేయవచ్చు.

ప్రతీ Question కి ఆన్సర్ చేయడానికి 30 సేకేండ్స్ మాత్రమే టైం వుంటుంది.  మొత్తం 20 Questions  వుంటాయి వీటిలో కనీసం 12 Questions కి ఆన్సర్ చేయాల్సి వుంటుంది. టెస్ట్ పాస్ అయితే ఓకే ఒకవేళ టెస్ట్ పాస్ కాకపోతే 24 గంటల తర్వాత మరల ఫిజ్ పే చేసి రీ టెస్ట్ కి వెళ్ళవచ్చు. ఫిజ్ పే చేయడం కోసం  Fee Payments పై క్లిక్ చేసి పైన ఉన్న E-payment  పై క్లిక్ చేసి Retest fee పై క్లిక్ చేసి ఫిజ్ పే చేయవచ్చు.అలాగే ముందు చెప్పిన విధంగా మరల స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ పాస్ అయిన తర్వాత Learner licence నెంబర్ మీ మొబైల్ కు వస్తుంది.

Learner licence ను  ఆన్లైన్ లో డౌన్లోడ్ చేయడం ఎలా!

Learner licence ను  ఆన్లైన్ లో డౌన్లోడ్ చేయడం కోసం పరివాహన్ అనే వెబ్సైటు ను ఓపెన్ చేయాలి. పైన Learner licence అని ఉంటుంది దాని పై క్లిక్ చేయాలి. దానిలో Print Learner License  అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. వెంటనే మొబైల్ కు OTP వస్తుంది. OTP ఇచ్చి submit పై క్లిక్ చేయాలి. వెంటనే Learner licence  పి.డి.యఫ్ లో డౌన్లోడ్ అవుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసి అపాయింట్మెంట్ ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం

Learner licence మీకు వచ్చిన తేది నుంచి 30 రోజులు పూర్తి అయిన తర్వాత మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసి అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోగలరు. ఇదే  పరివాహన్ సేవా అనే వెబ్సైటు ను ఓపెన్ చేయాలి. దీనిలో  Apply for Driving License పై క్లిక్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి.  దీనిలో మీ యొక్క Learner licence నెంబరు అలాగే డేట్ అఫ్ బర్త్ ఇచ్చి ఓకే పై క్లిక్ చేయాలి.

వెంటనే మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. దిగువున Select All పై టిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేయాలి. వెంటనే పేజి ఓపెన్ అవుతుంది. పేజ్ లో ఉన్న అప్లికేషన్ నెంబర్ ను నోట్ చేసుకోండి. దిగువున ఉన్న నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఈ పేజ్ లో Captcha Code ఇచ్చి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఈ పేజ్ దిగువున Fee payment అని ఉంటుంది. దీని పై టిక్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి.

Payment Process:

Learner licence కోసం ఎలా అయితే పేమెంట్ చేసారో, same అదే విధంగా ఫీజ్ పే చేయాలి. Payment పూర్తి అయ్యాక Payment రిసిప్ట్ print తీసుకోండి. నెక్స్ట్ స్లాట్ బుకింగ్ కొరకు అపాయింట్మెంట్ పై క్లిక్ చేసి DL Test Slot Booking పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ పై టిక్ చేసి, అప్లికేషన్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, Captcha Code ఇచ్చి సబ్మిట్ చేయాలి. దిగువున సీరియల్ నెంబర్ క్రింద టిక్ చేసి Proceed to Book పై క్లిక్ చేయాలి. మీకు వీలైన తేదీని సెలెక్ట్ చేసి,ఏ టైం కి వెళ్ళగలరో ఇక్కడ ఇవ్వాలి.

దిగువున ఉన్న  book Slot పై క్లిక్ చేయాలి. వెంటనే మీ మొబైల్ కు ఒటిపి వస్తుంది. ఒటిపి ని ఎంటర్ చేసి Conform to Slot book పై క్లిక్ చేయాలి. వెంటనే మీకు అపాయింట్మెంట్ రిసీప్ట్ వస్తుంది దీనిని ప్రింట్ తీసి ఉంచాలి. ఈ విధంగా మీరు  డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లికేషన్ ఫిల్ చేయాలి. తర్వాత Slot book చేసుకున్న టైం కి మీరు  డ్రైవింగ్ టెస్ట్ కి  RTO Office కు వెళ్ళాల్సి ఉంటుంది.

మీరు టెస్ట్ కి వెళ్ళేటప్పుడు ఈ డాకుమెంట్స్ తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి

  1. Aadhar Card Xerox & Original Aadhar Card
  2. Payment Receipt
  3. Leaner License Xerox
  4. Provisional Appointment for Driving Skill Test
  5. Helmet
  6. Vehicle with Working Signal Lights

మీ స్వంత వెహికల్ ఉండాలని ఏమి లేదు. మీ ఫ్రెండ్స్ వెహికల్ కూడా తీసుకొని వెళ్ళవచ్చు. ముందుగా మీ డాకుమెంట్స్ వెరిఫై చేసి మీతో థంబ్ వేయిస్తారు. నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ దగ్గర మీరు డ్రైవింగ్ టెస్ట్ చేయాలి.  ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ అనేది చాలా కేర్ ఫుల్ గా చేయాలి. రోడ్ టర్న్ అయ్యేటప్పుడు కచ్చితంగా Signal Lights ఆన్ చేయాలి.అలాగే రోడ్ టర్న్  దాటిపోయాక Signal Lights ఆఫ్ చేయాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు 20 నుంచి 30 స్పీడ్ లో మాత్రమే డ్రైవ్ చేయాలి. ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ కేర్ ఫుల్ గా చేస్తే మీరు కచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవుతారు.

ఒకవేళ ఫెయిల్ అయితే 7 రోజులలో మరలా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని  డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్ళవచ్చు.   Learner License ఫెయిల్ అయితే ఏ విధంగా రీ టెస్ట్ కి అప్లై చేసామో  same అదే విధంగా ఇక్కడ కుడా డ్రైవింగ్ లైసెన్స్ కోసం రీ టెస్ట్ కి అప్లై చేయాలి. డ్రైవింగ్ టెస్ట్ లో మీరు పాస్ అయినట్లయితే 24 గంటలలో మీ మొబైల్ కు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ తో మెసేజ్ వస్తుంది.

డ్రైవింగ్ లైసెన్స్ ను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేయడం ఎలా!

డ్రైవింగ్ లైసెన్స్ ను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేయడం  కోసం కుడా ఇదే  వెబ్సైటు ను ఓపెన్ చేయాలి. దీనిలో పైన ఆన్లైన్ సర్వీసెస్  అని ఉంటుంది దీని పై క్లిక్ చేయాలి. దీనిలో Driving License Related Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దిగువన మీయొక్క  స్టేట్ ను సెలెక్ట్ చేయాలి. పైన డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది దీనిలో Print Driving License పై క్లిక్ చేయాలి  దీనిలో అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. వెంటనే మొబైల్ కు OTP వస్తుంది. OTP ఇచ్చి DL ప్రింట్  పై క్లిక్ చేయాలి.

వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ పి.డి.యఫ్ లో డౌన్లోడ్ అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ప్రస్తుతం పి.వి.సి కార్డ్ రూపంలో ఇవ్వడం లేదు. ఈ పి.డి.యఫ్ లో డౌన్లోడ్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ వేలిడ్ అవుతుంది ప్రింట్ తీసి ఉపయోగించుకోవచ్చు. పోలిస్ వెరిఫికేషన్ లో కుడా ఈ పి.డి.యఫ్ లో ప్రింట్ తీసిన  డ్రైవింగ్ లైసెన్స్ వేలిడ్ అవుతుంది.

Best Life Time Free Credit Cards Direct Link Click Here

Amazon Deals Link Click Here

Best ACs కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బెస్ట్ రైస్ కుక్కర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Best Smart TVs కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బెస్ట్ స్మార్ట్ వాచెస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a comment