Free Gas Cylinder

Free Gas Cylinder AP ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి, అర్హతలు మరియు దరఖాస్తు ఎలా!

 https://futuretecheducator.com/free-gas-cylinder

Free Gas Cylinder – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వీపం పథకం క్రింద అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ పథకం దీపావళి పండగ రోజున ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టనున్నారు.

ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు అర్హులైన వారికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు. ఈ పధకం వలన ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనుంది.

ఎల్‌పీజీ కనెక్షన్‌ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. బీపీఎల్ కుటుంబాలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిని ప్రమాణికంగా తీసుకోనున్నారు. ఈ పథకానికి ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం ప్రయోజనం పొందేవారు అర్హులు. మిగతా వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉజ్వల గ్యాస్ లబ్దిదారులకు సులభంగా ఈ సిలిండర్ల పథకం అమలవుతుంది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి, ఆర్థికంగా వెనకబడిన వారు ఈ  పథకానికి అర్హులు.

ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, గ్యాస్ కనెక్షన్ వివరాలు, మొబైల్ నంబర్, కరెంట్ బిల్లు మొదలగు డాక్యుమెంట్స్ రెడీ గా ఉంచుకోవాల్సి ఉంటుంది.

futuretecheducator

3  సిలిండర్ల కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలో ఈ వెబ్సైటు లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ లో మీ పేరు, చిరుమానా రాయాలి. అలాగే డాక్యుమెంట్స్, ఫొటోలు అప్ లోడ్ చేయాలి. చివరగా యాక్సెప్ట్ చేసి, సబ్ మిట్ చేయడంతో దరఖాస్తు పూర్తవుతుంది.

ఈ అప్లికేషన్‌లను అధికారులు పరిశీలించి.. అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ జాబితాలను ప్రదర్శించాలని భావిస్తున్నారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి గారు తెలియజేసారు.

ఆర్థిక ఇబ్బందులున్నా సరే ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నామని, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 3 ఉచిత సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు.

తమకు పథకం అందలేదనే మాట అర్హుల నుంచి రాకూడదని అధికారులకు తెలియజేసారు.

ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే.. ప్రభుత్వంపై ఏడాదికి రూ.2,684 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.13,423 కోట్ల రూపాయలు ప్రభుత్వం పై భారం పడుతుందని అంచనా వేశారు.

గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.876 ఉంటే.. ఇందులో రూ.25 రాయితీ లబ్ధిదారు అకౌంట్‌లో జమ అవుతోంది. మిగిలిన రూ.851 లబ్ధిదారుల అకౌంట్‌లో జమ చేస్తారు.

లబ్ధిదారులు ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఒక సిలిండర్‌ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

అన్ని రకాల ప్రభుత్వ స్కీమ్స్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Best ACs కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బెస్ట్ రైస్ కుక్కర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Best Smart TVs కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బెస్ట్ స్మార్ట్ వాచెస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a comment