AC – స్ప్లిట్ ఏసీ లేదా ఏసీ బెటర్?

AC – స్ప్లిట్ ఏసీ లేదా ఏసీ బెటర్? AC దీనినే Air Conditioner అని కుడా అంటారు.

కొత్తగా A/C ని కొనాలనుకొనేవారు ఎలాంటి AC ని తీసుకోవాలి, ఏసీ ని ఎలా వాడితే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది, ఏసీ ఉపయోగించడం వలన ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా!

AC – స్ప్లిట్ ఏసీ లేదా ఏసీ బెటర్? కొత్తగా A/C ని కొనాలనుకోనేవారు, ముందుగా మీరు ఏసీని ఏ రూమ్ లో బిగించాలనుకుంటున్నారో ఆ రూమ్ యొక్క పొడవు అలాగే వెడల్పు మరియు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి.

మీరు రూమ్ యొక్క కొలతలు చెక్ చేసాక కాలిక్యులేటర్ తో మీ రూమ్ కి ఎంత టన్ ఏసీ అవసరమో ఈజీ గా కాలిక్యులేట్ చేయవచ్చు.  ఆన్లైన్ కాలిక్యులేటర్ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి. ఈ విధంగా మీ రూమ్ సైజ్ ను బేస్ చేసుకొని ఎంత కెపాసిటీ A/C  ని తీసుకోవాలో మీరే నిర్ణయించుకోవచ్చు.

AC – స్ప్లిట్ ఏసీ లేదా ఏసీ బెటర్?

A/C  ని తీసుకున్నప్పుడు స్టార్ రేటింగ్ ఎక్కువ ఉన్న A/C  ని ప్రిఫర్ చేయాలి. ప్రస్తుతం 5 స్టార్ రేటింగ్ ఉన్న A/C  కి ప్రిఫర్ చేయండి.  స్ప్లిట్  A/C  లో Non Inverter A/C  కంటే Inverter A/C  ని ప్రిఫర్ చేయండి.

Inverter A/C  అంటే Inverter తో పనిచేస్తుందనుకుంటే పొరపాటే, Inverter A/C  కుడా కరెంట్ తోనే పనిచేస్తుంది కానీ Inverter A/C  తీసుకోవడం వలన టెంపరేచర్ అప్ డౌన్ కాకుండా Balanced గా వుంటుంది దీనివలన  కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తుంది. కనుక Inverter A/C  ని తీసుకోవడం బెటర్.

A/C  ని తీసుకున్నప్పుడు anti bacterial filter ఉండే విధంగా చూసుకోండి. ఈ ఫిల్టర్ ఉండడం వలన మనకు  ఎలాంటి వైరస్ రాకుండా కాపాడుతుంది. ప్రస్తుతం వస్తున్న అన్ని A/C  లకు ఈ anti bacterial filters ఉంటున్నాయి కనుక ఒకసారి చెక్ చేసుకోండి.

ఏ.సి ని ఎలా వాడితే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది.

A/C ని బిగించే రూమ్ లో డోర్స్ కి గానీ, విండోస్ కి గానీ ఎక్కడా gaps అంటే ఖాళీలు లేకుండా చేసుకోవాలి. ఎక్కడైనా హోల్స్ వుంటే కూలింగ్ బయటకు పోతుంది. ఇలా  కూలింగ్ బయటకు పోవడం వలన A/C పైన వత్తిడి పడి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే చాన్స్ వుంటుంది. A/C ని బిగించే రూమ్ లో కచ్చితంగా సీలింగ్ చేపించాలి.

సీలింగ్ లేకుండా A/C ని ఉపయోగించడం వలన కూలింగ్ అనేది పైన స్లాబ్ వరకూ వెళుతుంది.  మార్నింగ్ ఎండకు స్లాబ్ వేడెక్కడం వలన కూలింగ్  ఎక్కువుగా  waste అవుతుంది దీనివలన  కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే చాన్స్ వుంటుంది.

A/C ని ఉపయోగించేవారు  24 డిగ్రీల  నుంచి 28 డిగ్రీల  మద్యలో Temperature ను పెట్టుకోవాలి. ప్రస్తుతం కొత్త గా కొన్న A/C లకు డిఫాల్ట్ గా 24 డిగ్రీల  Temperature సెట్ చేసారు. ఎందుకంటే BEE – బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ – అన్ని కంపెనీలకు  డిఫాల్ట్ గా 24 డిగ్రీల  Temperature ను ఉంచాలని సూచించడం జరిగింది.

అలాగే ప్రస్తుతం కొన్న ప్రతీ A/C  పైన డిఫాల్ట్ గా 24 డిగ్రీల  Temperature ను ఉపయోగించమని ఒక స్టిక్కర్ కుడా అతికించి వుంటుంది ఒక సారి చెక్ చేసుకోండి. అయితే  కొంత మంది 18 డిగ్రీల Temperature ను పెడుతుంటారు. దీనివలన  కరెంట్ బిల్ చాలా ఎక్కువగా వస్తుంది.

ఎలాంటి టిప్స్ పాటించాలి?

బయట ఎండ నుంచి A/C రూమ్ లోకి వచ్చిన వారికీ  24 డిగ్రీల నుంచి 28 డిగ్రీల  మద్యలో Temperature వుంటే మీకు పెద్దగా కూలింగ్ అనిపించకపోతే – మీరు ఏం చేయాలంటే! మీరు A/C రూమ్ లోకి వచ్చే ముందు స్నానం చేసి గానీ లేదా ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని గానీ A/C రూమ్ లోకి వచ్చినట్లయితే, A/C రూమ్ లో 24 డిగ్రీల నుంచి 28 డిగ్రీల  మద్యలో Temperature వుంటే చాలు మీకు చలి అనిపిస్తుంది. కావున ఇలాంటి టెక్నిక్స్ పాటించి కరెంట్ బిల్ ఎక్కువగా రాకుండా చేయవచ్చు.

"</p

రూమ్ లో సీలింగ్ ఉన్న వారు A/C   తో పాటు ఫ్యాన్ కూడా on చేసుకుంటే బెటర్. ఫ్యాన్ వేయడం వలన చల్లని గాలి రూమ్ మొత్తం స్ప్రెడ్ అయ్యి రూమ్ అంతా త్వరగా చల్లబడుతుంది. రూమ్ లో సీలింగ్ లేని వారు మాత్రం ఫ్యాన్ వేయకపోవడం బెటర్ ఎందుకంటే పైన స్లాబ్ కు ఉన్న వేడి మొత్తం ఫ్యాన్ on చేయగానే ఆ వేడి అంతా క్రిందకు వచ్చి రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది దీనివలన రూమ్ కూలింగ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఈ విధంగా కూడా  కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చే అవకాశం వుంటుంది.

A/C   రూమ్ లో విండోస్ వుంటే, ఆ విండోస్ కి బయట నుంచి ఎండ పడుతున్నట్లైతే విండోస్ వేడెక్కి రూమ్ లోపల కూలింగ్ వెస్ట్ అయ్యే అవకాశం వుంటుంది. అలాంటప్పుడు రూమ్ లోపల అలాగే రూమ్ బయట విండోస్ కి Curtains ను అమర్చుకోవాలి. Curtains అనేవి కాస్త మన్దమ్ ఎక్కువ వుండే విధంగా చేసుకోవాలి.

ఏ.సి ని కనీసం 15 రోజులకు ఒక సారి అయినా క్లీన్ చేసుకోవాలి. ఏ.సి ని on చేసాక రూమ్ తుడవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే AC లోకి డస్ట్ వెళ్లి కూలింగ్ సరిగా రాదు.  ఏ.సి ని ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియొ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏ.సి యొక్క ఔటర్ కి ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి. AC యొక్క ఔటర్ నీడ లో వుంచడం వలన రూమ్ త్వరగా  కూల్ అవుతుంది. AC రూమ్ లో సాద్యమైనంత వరకూ ఐరన్ బీరువా అలాగే ఎలక్ట్రిక్ వస్తువులు పెట్టకపోవడం మంచిది. ఇలాంటి  వస్తువులు వుంచడం వలన రూమ్ త్వరగా కూల్ అవ్వదు.

నేను ఇప్పటివరకు చెప్పిన అన్ని విషయాలు మీరు పాటిస్తే.. మీ కరెంట్ బిల్ అనేది కచ్చితంగా 50 % వరకూ తగ్గుతుంది.

A/C ఉపయోగించడం వలన ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా!

ఇది చాలా మంది లో ఉండే డౌట్. A/C ని 24 డిగ్రీల  Temperature  నుంచి 28 డిగ్రీల  Temperature మద్యలో ఉపయోగించినట్లయితే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు. A/C ని 24 డిగ్రీల  Temperature  కంటే తక్కువ లో ఉపయోగిస్తే మాత్రం కొంత మందిలో జలుబు చేసే అవకాశం వుంటుంది.

A/C ని ఉపయోగించడం వలన ఆరోగ్య సమస్యలు పెద్దగా ఏమి రావు ఎందుకంటే పేషెంట్స్ కి హాస్పిటల్స్ లో ICU లో పెడతారు కదా మరి A/C వలన ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే ICU లో ఎందుకు పెడతారు. చాలా మంది డాక్టర్స్ కుడా నిరంతరం A/C ని వాడుతుంటారు. వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉంటారు కదా.  సో A/C ఉపయోగించడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు

ఏ కంపెనీ A/C  ని కొనాలనే కన్ఫ్యూషన్ మీకు ఉంటె – ఈ వీడియో లో కొన్ని బెస్ట్ A/C s యొక్క లింక్స్ ఉన్నాయి చూడండి.

Buy Online Best ACs:

LG 1.5 Ton 5 Star DUAL Inverter Split AC 2024 Model Click here

Blue Star 1.5 Ton 5 Star Inverter Split AC 2024 Model Click here

Voltas 1.5 ton 5 Star, Inverter Split AC 2024 Model Click here

Blue Star 1.5 Ton 3 Star Wi-Fi Inverter Smart Split AC Click here

Daikin 1.5 Ton 3 Star Inverter Split AC Click here

Panasonic 1.5 Ton 3 Star Wi-Fi Inverter Smart Split AC Click here

4 thoughts on “AC – స్ప్లిట్ ఏసీ లేదా ఏసీ బెటర్?”

Leave a comment