Credit Card Full Details

క్రెడిట్ కార్డు గురించి పూర్తి సమాచారం- Credit Card Full Details

మీ యొక్క ఆదాయం మరియు Expenditure ను బేస్ చేసుకొని బెస్ట్ క్రెడిట్ కార్డు ను ఎంచుకోవాలంటే , దీనికోసం ఒక ఉదాహరణ:

INCOME MONTHLY EXPENDITURE USING CREDIT CARD LIFE TIME FREE CREDIT CARD (1%)  CREDIT CARD JOINING FEE & YEARLY FEE APPLICABLE (5%)
30000 20000 200 1000
20000 7000 70 350
15000 5000 50 250

 

క్రెడిట్ కార్డు గురించి పూర్తి సమాచారం- Credit Card Full Details https://futuretecheducator.com/credit-card-full-details

మీ యొక్క ఆదాయం నెలకు 30000/- అనుకోండి దానిలో క్రెడిట్ కార్డు ను ఉపయోగించి 20000/- ఖర్చు చేస్తే అంటే కిరాణా సామాన్లు, షాపింగ్స్స్ , మొబైల్ రీచార్జ్ లు, బిల్ పేమెంట్స్ ఇలా అన్ని.. క్రెడిట్ కార్డు ను ఉపయోగించి పే చేసినట్టయితే .. మీకు LIFE TIME FREE CREDIT CARD కి అయితే కేవలం  (1%)  అంటే 2౦౦/-  మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది.

ఈ క్యాష్ బ్యాక్ అనేది రివార్డ్స్ రూపంలో వస్తుంది . అదే JOINING FEE & YEARLY FEE ఉన్న క్రెడిట్ కార్డు కి అయితే  (5%) అంటే 1000/-  వరకూ క్యాష్ బ్యాక్ వస్తుంది.సో ఇలాంటివారు JOINING FEE & YEARLY FEE ఉన్న క్రెడిట్ కార్డు ఎంచుకోవడం బెటర్ అని చెప్పుకోవచ్చు.అదేవిధంగా మీ యొక్క ఆదాయం నెలకు 20000/- అనుకోండి దానిలో క్రెడిట్ కార్డు ను ఉపయోగించి  7000/- ఖర్చు చేస్తే మీకు LIFE TIME FREE CREDIT CARD కి అయితే కేవలం  7౦/- మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది.

అదే JOINING FEE & YEARLY FEE ఉన్న క్రెడిట్ కార్డు కి అయితే  350/- వరకూ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇలాంటివారు కుడా  JOINING FEE & YEARLY FEE ఉన్న క్రెడిట్ కార్డు ఎంచుకోవడం బెటర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఆదాయం నెలకు 15000 అనుకోండి దానిలో క్రెడిట్ కార్డు ను ఉపయోగించి ఎప్పుడో ఒకసారి  5000 వరకు ఖర్చు చేస్తే మీకు LIFE TIME FREE CREDIT CARD కి అయితే  5౦/- మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది.

అదే JOINING FEE & YEARLY FEE ఉన్న క్రెడిట్ కార్డు కి అయితే  250/-  క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇలాంటివారు LIFE TIME FREE ఉన్న క్రెడిట్ కార్డు ఎంచుకోవడం బెటర్ అని చెప్పుకోవచ్చు ..

క్రెడిట్ కార్డు గురించి పూర్తి సమాచారం- Credit Card Full Details

రూపే యు.పి.ఐ క్రెడిట్ కార్డ్ లు

రూపే యు.పి.ఐ క్రెడిట్ కార్డ్ లు వచ్చాయి. ఈ  రూపే యు.పి.ఐ క్రెడిట్ కార్డ్ చాలా ఉపయోగపడుతుంది, ఈ  రూపే యు.పి.ఐ క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి ఫోన్ పే, గూగుల్ పే – మర్చంట్ యు.పి.ఐ స్కానర్ ఉన్న  ప్రతీ షాప్ లో కుడా పే చేయవచ్చు.. ప్రస్తుతం చిన్న చిన్న షాప్స్ లో కుడా ఈ యు.పి.ఐ స్కానర్స్ అందుబాటులో ఉంటున్నాయి .. కనుక రూపే యు.పి.ఐ క్రెడిట్ కార్డ్ ను తీసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి.

Apply Axis Rupay Credit Card Online Click Here

కొత్తగా క్రెడిట్ కార్డు కి అప్లై చేసి కేష్ బ్యాక్ రివార్డ్ పొందడం ఎలా?

కొత్తగా క్రెడిట్ కార్డు కి అప్లై చేయాలనుకోనేవారు కాష్ కరో యాప్ ద్వారా అప్లై చేస్తే మీకు 500/- నుంచి 2500/- వరకు కేష్ బ్యాక్ రివార్డ్ అనేది వస్తుంది. ఈ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి . ముందుగా ఈ కాష్ కరో యప్ లో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత సైన్ ఇన్ అయ్యాక .. మీకు ఏ క్రెడిట్ కార్డ్ కావాలో ఎంచుకోవాలి. ఈ కాష్ కరో యప్ లో చాలా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఏ క్రెడిట్ కార్డ్ కి ఎంత కేష్ బ్యాక్ రివార్డ్ వస్తుందో కుడా ఇక్కడ ఉంటుంది. వీటిలో మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ పై క్లిక్ చేయండి. దిగువున మీరు సెలెక్ట్ చేసిన క్రెడిట్ కార్డ్ కి ఏ ఏ ఆఫర్స్ వర్తిస్తాయో కనిపిస్తుంది ఒక సారి క్లియర్గా చదవండి. అలాగే LIFE TIME FREE ఉన్న క్రెడిట్ కార్డు కావాలనుకొనేవారు JOINING FEE & YEARLY FEE , LIFE TIME FREE అని ఉందా లేదా అనేది కచ్చితంగా చెక్ చేసుకోండి.

ఫైనల్ గా అప్లై నౌ పై క్లిక్ చేసి మీయొక్క పూర్తి డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేయండి. క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసే వారికి ఖచ్చితంగా పాన్ కార్డ్ ఉండాలి. పాన్ కార్డ్ మీదగ్గర లేకపోతే ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో  వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి . క్రెడిట్ కార్డ్ అప్లై చేసాక అప్ప్రోవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ వుండాలి..  సిబిల్ స్కోర్ కు సంబంధించి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్రెడిట్ కార్డ్ బిల్ ఎప్పుడు జనరేట్ అవుతుంది .. క్రెడిట్ కార్డ్ బిల్ ను ఎటువంటి ఫైన్ లేకుండా ఆన్లైన్ లో ఎలా పే చేయాలి?

ఉదా: ICICI క్రెడిట్ కార్డ్ బిల్ ప్రతీ నెలా 20 వ తేదిన జనరేట్ అవుతుంది అనుకోండి. ఆ జనరేట్ అయిన బిల్ ను తర్వాత నెల 5 వ తేదిన పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్ ను పే చేయడానికి 45 డేస్ టైం వుంటుంది. బిల్ జనరేట్ 20 వ తేదిన అయినట్లయితే 21 వ తేది న  క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏదైనా కొన్నట్లయితే దాని యొక్క బిల్ అనేది తర్వాత నెల 20 వ తేదిన జనరేట్ అవుతుంది. ఆ బిల్ ను తర్వాత నెల 5 వ తేదిన పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 45 డేస్ టైం వుంటుంది. అలా కాకుండా బిల్ జనరేట్ కు ముందు రోజు క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏదైనా కొన్నట్లయితే ఆ అమౌంట్ బిల్ లో add అవుతుంది. ఆ అమౌంట్ ను మాత్రం కేవలం 15 రోజులు పే చేయాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక చాలా మంది ఫైన్ తో క్రెడిట్ కార్డ్ బిల్ ను పే చేస్తుంటారు.

క్రెడిట్ కార్డ్ బిల్ ఇన్ టైం లో కట్టకపోతే మాత్రం ఫైన్ చాలా ఎక్కువుగా ఉంటుంది.  క్రెడిట్ కార్డ్ బిల్ ను పే చేయడానికి బెస్ట్ యాప్ ఏంటంటే  CRED అనే యాప్. ఈ యప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ యప్ లో క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తే ప్రతీ పేమెంట్ కి కాష్ బ్యాక్ వస్తుంది అలాగే ఈ యాప్ మీరు  క్రెడిట్ కార్డ్ బిల్ ను ఎప్పుడు కట్టలో ఫ్రీక్వెన్ట్లి గుర్తు చేస్తుంది. కనుక ఈ యప్ లో ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్ బిల్ ను కడుతుంటారు.

Best Credit Cards Apply Online Direct Links Click Here 

పూర్తి వివరాలు వీడియో రూపంలో కావాలంటే ఇక్కడ చుడండి.

Leave a comment