Tatkal Ticket Booking Time – తత్కాల్ టికెట్ ను బుక్ చేసే విధానం

Tatkal Ticket Booking Time – తత్కాల్ ట్రైన్ టికెట్ ను ఐ.ఆర్.టి.సి వెబ్సైట్ ఈ టెక్నిక్స్ పాటించి తత్కాల్ టికెట్ను బుక్ చేస్తే ఖచ్చితంగా టికెట్ అనేది కన్ఫామ్ అవుతుంది. Tatkal Ticket Booking Time – తత్కాల్ టికెట్ ను బుక్ చేసే విధానం

తత్కాల్ టికెట్ ను బుక్ చేసే ప్రాసెస్ మొత్తం టెక్నిక్స్ తో ఈ క్రింది ఇవ్వబడింది.
futuretecheducator
Tatkal Ticket Booking Time – తత్కాల్ టికెట్ ను బుక్ చేసే విధానం

ట్రైన్లో ప్రయాణం అంటే చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారు దీనికి గల కారణం టికెట్ ధర తక్కువగా ఉంటుంది.

అలాగే సేఫ్ గా మరియు కంఫర్ట్ గా ఉంటుందని ట్రైన్లో ప్రయాణం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

తత్కాల్ ట్రైన్ టికెట్ ఎక్కడ బుక్ చేయాలి?

చాలా మంది తత్కాల్ ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు గాని తత్కాల్ టికెట్ దొరకకపోవడం వల్ల కొన్నిసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ట్రైన్ టికెట్ ను బుక్ చేయడం కోసం ఆన్లైన్ లో అయితే ఐ ఆర్ టి సి గాని లేదా రైల్వే స్టేషన్ గాని లేదా ఏజెంట్ ద్వారా తత్కాల్ ట్రైన్ టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. 

అత్యవసర ప్రయాణం చేసేటప్పుడు తత్కాల్ టికెట్ బుకింగ్ చాలా ఉపయోగపడుతుంది ప్రయాణానికి ఒకటి లేదా రెండు రోజులు ముందు ఏదైనా ట్రైన్ లో సుమారుగా ఐదు నుండి 10 శాతం సీట్లు ఐ.ఆర్.సి.టి.సి. తత్కాల్ విధానం ద్వారా బుక్ చేయబడతాయి. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి మీరు ఆర్.సి.టి.సి. తత్కాల్ టికెట్లు కొనుగోలు చేయడానికి ఈ క్రింది ఇవ్వబడిన టిప్స్ పాటించినట్లయితే మీకు ఖచ్చితంగా సీట్ కన్ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది.

నార్మల్గా రిజర్వేషన్  చేసే ట్రైన్ టికెట్ కంటే ఈ తత్కాల్ ట్రైన్ టికెట్ ధర మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది.

తత్కాల్ ట్రైన్ టికెట్ ఏ టైం లో బుక్ చేయాలి?

Tatkal Ticket Booking Time - తత్కాల్ టికెట్ ను బుక్ చేసే విధానం
Tatkal Ticket Booking Time – తత్కాల్ టికెట్ ను బుక్ చేసే విధానం

నార్మల్గా రిజర్వేషన్ చేసే ట్రైన్ టికెట్లు స్టేషన్ నుంచి స్టేషన్కు ఎంత అని ఉంటుంది. అదే తత్కాల్ టికెట్ అయితే మాత్రం మనం ప్రయాణించే డిస్టెన్స్ పై ఆధారపడి ఉంటుంది. అందుకే తత్కాల్ టికెట్ కు డిస్టెన్స్ నిబంధనలు ఉంటాయి. ట్రైన్ స్టేషన్లో బయలుదేరే సమయం రాత్రి  12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో ఉంటే రెండు రోజులు ముందు తాత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

అలాగే ట్రైన్  స్టేషన్ నుంచి బయలుదేరే సమయం

ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల మధ్యలో ఉంటే ఒకరోజు ముందు మాత్రమే తాత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది.

తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి (3 AC /2AC/ CC/ EC 3E) టికెట్ విండో అనేది ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుంది.

  అలాగే నాన్ ఏసీలో (SL/FC/2S) ఈ విండో ఉదయం 11 గంటలకు ఓపెన్ అవుతుంది.

తత్కాల్ ట్రైన్ టికెట్ ఏ వెబ్ సైట్ లో బుక్ చేయాలి?

ఆన్లైన్లో టికెట్ బుకింగ్ ఐ.ఆర్.సి.టి.సి. వెబ్సైట్లో గాని, పేటీఎం, అమెజాన్ యాప్ లో గాని, లేదా రైల్వేస్టేషన్లో గాని, లేదా ఏజెంట్లు ద్వారా గాని, తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

తత్కాల్ టికెట్లను బుక్ చేసేటప్పుడు వెయిటింగ్ లిస్టులో గాని ఆర్ఏ.సి లో గాని ఉంటే అర గంటలో టికెట్ను క్యాన్సిల్ చేసుకోవచ్చు.

దీనికి కొంత కాన్స్లేషన్ చార్జెస్ తీసుకొని కొంత అమౌంట్ను రెఫండ్ చేస్తారు. తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసే అవకాశం ఉండదు.

ఒకవేళ చార్ట్ ప్రిపేర్ అయినప్పటికీ మీ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటే మాత్రం ఆటోమెటిగ్గా టికెట్ క్యాన్సిల్ అయి అమౌంట్ మొత్తం అకౌంట్ లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది.

స్లీపర్ క్లాస్ తత్కాల్ టికెట్ ధర బేసిక్ ఫేర్లు లో 10 శాతం ఎక్కువగా ఉంటుంది.

ఇతర క్లాస్ కు 30 శాతం ఎక్కువ ఉంటుంది. దీనికి కూడా మినిమం మాక్సిమం చార్జీలు ఉంటాయి.

ఆన్లైన్లో తత్కాల్ టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.

కంప్యూటర్ ,ల్యాప్టాప్ లేదా స్మార్ట్ ఫోన్ దేనిలోనైనా తత్కాల్ టికెట్లను బుక్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్ గా ఉండే విధంగా చూసుకోండి.

దీనివల్ల టైం వేస్ట్ అనేది అవ్వదు.

తత్కాల్ ట్రైన్ టికెట్ ఫాస్ట్ గా బుక్ చేయడానికి సూచనలు:

futuretecheducator

ఐ.ఆర్.సి.టి.సి. లాగిన్ లో లాగిన్ అయ్యి తత్కాల్ టికెట్ బుకింగ్ చేసేముందు మాస్టర్ లిస్టులో పాసెంజర్లు అందరి పేర్లు ఎంటర్ చేసుకోవాలి. మాస్టర్ లిస్టులో పేర్లు ఎలా యాడ్ చేయాలంటే ఐఆర్టిసి లో లాగిన్ అయ్యి మై అకౌంట్ లో మై ప్రొఫైల్ లో యాడ్ మాడిఫై మాస్టర్  లిస్ట్ పై క్లిక్ చేసి ప్యాసింజర్ అందరి పేర్లు ఎంటర్ చేసుకోవాలి.

ఇలా ముందుగా ఎంటర్ చేయడం వల్ల టికెట్ బుక్ చేసే సమయంలో ప్యాసింజర్ నేమ్ ను సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇలా చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ముందుగా జర్నీ డీటెయిల్స్ అలాగే ట్రైన్ డీటెయిల్స్ టైం అన్ని ఒక పేపర్ పై రాసి ఉంచుకోవాలి.

నెక్స్ట్ ఐ.ఆర్.సి.టి.సి. లో ఒక్క నిమిషం ముందు మాత్రమే లాగిన్ అవ్వండి. ఎక్కువ సమయం లాగిన్ అయి ఉండడం వల్ల టికెట్ బుక్ చేసే సమయంలో ఆటోమేటిక్గా ఐ.ఆర్.సి.టి.సి. వెబ్సైట్ లాగౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఐఆర్టిసిటి వెబ్ సైట్ లో ఒక్క నిమిషం ముందు మాత్రమే లాగిన్ అయితే మంచిది.

తత్కాల్ ట్రైన్ టికెట్ చార్జెస్ ఎలా చెల్లించాలి?

ట్రైన్ టికెట్స్ బుక్ చేయకముందు ఐ.ఆర్.సి.టి.సి.లో లాగిన్ అయి ఐ.ఆర్.సి.టి.సి.లో ఈ వేలెట్లో బుక్ చేయడానికి సరిపడా అమౌంట్ను యాడ్  చేసుకోండి ఐ.ఆర్.సి.టి.సి. ఈ వ్యాలెట్ లో మినిమం రూ 100/- నుండి రూ 10000/- వరకు యాడ్ చేసుకోవచ్చు. ఐ.ఆర్.సి.టి.సి. ఈ  వ్యాలెట్ ఉపయోగించి టికెట్ బుక్ చేస్తే చార్జెస్ మాత్రం రూ 10/- నుండి  రూ15/- వరకూ అదనంగా ఉంటాయి.

ఐ.ఆర్.సి.టి.సి. వ్యాలెట్ ఉపయోగించి అమౌంటు పే చేయడం వల్ల సమయం వృధా కాకుండా తత్కాల్ టికెట్ అనేది ఖచ్చితంగా కన్ఫామ్ అవుతుంది. ఐ.ఆర్.సి.టి.సి. ఈ వ్యాలీట్లో అమౌంట్ ఎలా యాడ్ చేయాలంటే ఐ.ఆర్.సి.టి.సి. వెబ్సైట్లో లాగిన్ అయి ఐ.ఆర్.సి.టి.సి. వ్యాలెట్ పై క్లిక్ చేసి ఐ.ఆర్.సి.టి.సి. ఈ వ్యాల్యూ రిజిస్టర్ పై క్లిక్ చేయాలి.

మీ యొక్క ఫొన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.

IRCTC ఈ వ్యాలీట్ అమౌంట్ని యాడ్ చేయడం ఎలా?

ఐ.ఆర్.సి.టి.సి. ఈ వ్యాలెట్ డిపాజిట్ పై క్లిక్ చేసి అమౌంట్ ను యాడ్ చేసుకోవచ్చు.

IRCTC ఈ వ్యాల్యుట్ లో ఉన్న అమౌంట్ను తిరిగి బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ మాత్రం ఉండదు.

కనుక వ్యాలీట్లో ఎక్కువ అమౌంటు యాడ్ చేయొద్దు.

ఐ.ఆర్.సి.టి.సి. ఈ వ్యాల్యూట్ వల్ల ఉపయోగం ఏమిటంటే తత్కాల్ టికెట్లను బుక్ చేస్తున్నప్పుడు వాలెట్లను సెలెక్ట్ చేస్తే పేమెంట్ అనేది  ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు.

నెక్స్ట్ తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ అనేది పిఎన్ఆర్ నెంబర్  కు  4 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలం.

అదే నార్మల్ టికెట్ బుకింగ్ అయితే 6 టికెట్లును బుక్ చేసుకొనే అవకాశం ఉంటుంది.

Buy Best AC (Air Conditioner) Online Buying Guide Click Here

 

Leave a comment