Best Rupay Credit Card – యాక్సిస్ బ్యాంక్ కు సంబంధించిన ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు కి ఆన్లైన్ లో అప్లై చేసే విధానం. ఈ విధంగా అప్లై చేస్తే 100% అప్రూవల్ అవుతుంది.
యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు అనేది ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుందంటే! ఎవరైతే ఎక్కువగా పెట్రోల్ లేదా డీజిల్ వినియోగిస్తుంటారో అలాంటి వారికి ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం వలన ఎక్కువగా డిస్కౌంట్ అనేది వస్తుంది. పెట్రోల్ లేదా డీజిల్ ఎక్కువుగా కొనేవాళ్లకి ఈ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది.
క్రెడిట్ కార్డు అప్లై చేసే ముందు క్రెడిట్ కార్డు వల్ల బెనిఫిట్స్ ఏంటనేది ఇక్కడ ఇవ్వడం ఒకసారి పూర్తిగా చదవండి.
యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు గురించి పూర్తి సమాచారం:
యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు అనేది రూపే క్రెడిట్ కార్డ్ తో వస్తుంది. అంటే మనం రూపే క్రెడిట్ కార్డు డైరెక్ట్ గా గూగుల్ పే ,ఫోన్ పే ,పేటీఎం ఇటువంటి పేమెంట్స్ యాప్స్ లో ఈ క్రెడిట్ కార్డు ను యాడ్ చేసుకుని మీరు ఈజీగా యూ.పి.ఐ payments చేయొచ్చు.
జాయినింగ్ ఫీజు విషయానికొస్తే ఇంతకుముందు ఇది లైఫ్ టైం ఫ్రీ ఆఫర్తో వచ్చేది. ప్రజెంట్ దీనికి జాయినింగ్ ఫీజ్ రూ 500/- పే చేయాలి. అలాగే యాన్యువల్ ఫీజు మీకు ఫ్రీ అవ్వాలంటే మీరు ఒక ఇయర్లో ఈ కార్డ్ తీసుకున్న తర్వాత 50000 లేదా అంతకంటే ఎక్కువ మనీ మీరు Transaction చేసినట్లయితే ఈ యాన్యువల్ ఫీజ్ అనేది మీకు జీరో అవుతుంది. ఒక ఇయర్లో ఈ కార్డ్ తీసుకున్న తర్వాత రూ 50000/- వరకూ transaction చేయక పోయినట్లైతే రూ 500/- వరకూ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కార్డు సంబంధించిన ఫీచర్స్ & బెనిఫిట్స్ దీనికి సంబంధించిన చార్జెస్ గురించి:
దీని ఫీచర్స్ చూసుకుంటే మనకి 4 పర్సంటేజ్ క్యాష్ బ్యాక్ వస్తుంది.అంటే మనం పెట్రోల్ కొట్టించిన ప్రతిసారి మనకి 4 పర్సంటేజ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది కూడా రివర్స్ పాయింట్స్ రూపంలో వస్తుంది.
క్రెడిట్ కార్డు తీసుకున్న 30 డేస్ లోనే ఫస్ట్ ట్రాన్సక్షన్ కంప్లీట్ చేసినట్లయితే 100% క్యాష్ బ్యాక్ కింద అప్ టు రూ 250/- క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి షాపింగ్ చేసినట్లయితే క్యాష్ బ్యాక్ కింద 5 రివార్డ్స్ పాయింట్స్ అనేవి వస్తాయి. ప్రతీ Transaction కి రూ 100/- లకు ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది.
ఈ క్రెడిట్ కార్డు ను ఆన్లైన్ లో అప్లై చేయడానికి యాక్సిస్ బ్యాంక్ అఫీషియల్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వెబ్సైటు ను ఓపెన్ చేసాక మిమ్మల్ని ఆర్.యు. ఎగ్జిస్టింగ్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అని అడుగుతుంది. ఒకవేళ మీకు యాక్సిస్ బ్యాంకులో సేవింగ్ అకౌంట్ ఉన్నట్లయితే ఎస్ పైన క్లిక్ చేయాలి. యాక్సిస్ బ్యాంకులో మీకు ఎటువంటి అకౌంట్స్ గాని క్రెడిట్ కార్డ్స్ గాని లేకపోతే నో మీద క్లిక్ చేయాలి.
కస్టమర్ డీటెయిల్స్ లో మీ మొబైల్ నెంబర్ అలాగే మీ పాన్ కార్డు నెంబర్ అలాగే మీ పిన్కోడ్ అలాగే యాన్యువల్ ఇన్కమ్ సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుందని ఎంటర్ చేసి, దిగువున క్యాప్చ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.
నేమ్ యాజ్ ఫర్ ఆధార్ అని ఆధార్ ఉంటుంది. సేమ్ అదే విధంగా నేమ్ ఇవ్వండి తరువాత డేట్ అఫ్ బర్త్ ఇవ్వండి తర్వాత టైటిల్ దగ్గర మీరు మిస్టర్ లేదా మిస్సెస్ అని సెలెక్ట్ చేసుకొని జెండర్ దగ్గర మేలా లేదా ఫిమేలా అని సెలెక్ట్ చేసుకోండి.
నేమ్ డిసైడ్ ఆన్ కార్డ్ అని ఉంటుంది. మీరు మీ కార్డు మీద నేమ్ ఎలా కనబడాలి అనుకుంటున్నారో ఆ నేమ్ ఇవ్వండి. తరువాత మదర్స్ నేమ్ దగ్గర మీ మదర్ నేమ్ అలాగే ఫాదర్స్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్ ఇవ్వండి. ఒకవేళ ఫాదర్ లేకపోతే స్పౌజ్ నేమ్ ఇవ్వవచ్చు.
మేరిటల్ స్టేటస్ లో మ్యారీడా లేదా అన్ మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అడ్రస్ దగ్గర మీ రెసిడెన్సియల్ అడ్రస్ ఇవ్వాలి. తర్వాత మీ ఆఫీస్ అడ్రస్ కూడా కనిపిస్తుంది అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత క్రెడిట్ కార్డ్ అనేది ఎక్కడికి కావాలి రెసిడెన్సా లేదా ఆఫీసా మీరు ఎక్కడైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి టిక్ బటన్ పై క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చెయ్యండి.
నెక్స్ట్ శాలరీడా లేక స్వయం వృత్తా అని వస్తుంది ఒకవేళ మీరు శాలరీ పర్సన్ అయి ఉంటే మీకు క్రెడిట్ కార్డ్ అనేది 99% అప్రూవల్ అయ్యే చాన్స్ ఉంటుంది. ఎందుకంటే సిబిల్ స్కోర్ బాగుంటుంది. అలాగే మీకు శాలరీ స్లిప్పు కూడా ఉంటుంది కాబట్టి అదే సెల్ఫ్ నెంబర్స్ కి ఓన్లీ సిబిల్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సిబిల్ స్కోర్ ను ఎలా పెంచుకోవాలో ఈ వీడియో లో చూడండి.
క్రెడిట్ కార్డు అప్రూవల్ గురించి:
మీ ఫైనాన్షియల్ హిస్టరీ అనేది బాగుంటే! మీకు క్రెడిట్ కార్డు అప్రూవల్ ఖచ్చితంగా వస్తుంది. దీనిలో శాలరీడా లేక సెల్ఫ్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ సోర్సు అఫ్ ఫండ్ దగ్గర మీకు ఎమౌంట్ అనేది ఎలా వస్తుంది క్యాష్ రూపంలో నా, శాలరీ రూపంలోనా, అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేచర్ అఫ్ బిజినెస్ అని ఉంటుంది. మీ బిజినెస్ టైపు ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ కంపెనీ నేమ్ అంటే మీ బిజినెస్ నేమ్ ఏంటి అని మీరు అక్కడ ఇవ్వాలి.
తర్వాత ఓనర్ షిప్ టైపు అని ఉంటుంది. మీరు ఓనర్ లేదా పార్ట్నర్షిప్ అని, కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ జాబ్ / బిజినెస్ అని ఉంటుంది. మీరు జాబ్ / బిజినెస్ లో ఎన్ని సంవత్సరాలు నుండి ఉంటున్నారు అని ఉంటుంది. మీ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ఎన్ని అనేది ఇచ్చి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి.
తర్వాత మీకు సెలెక్ట్ యువర్ కార్డు అని వస్తుంది. మీకు కొన్ని కార్డ్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. వాటిలో యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ రూపే క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. వెంటనే మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి, ఎగ్రీ ఆప్షన్ పై క్లిక్ చేసి, కింద ఉన్న టిక్ మార్క్ పై క్లిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
అక్కడ ఒక రిఫరెన్స్ ఐడి కూడా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే మీకు రిఫరెన్స్ ఐడి చూపించదు. తర్వాత మీ మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ లో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. అప్లికేషన్ విత్ ప్రైవేటు రిఫరల్స్ నెంబర్ అని వుంటుంది, క్రింద ఉన్న లింకు పైకి క్లిక్ చేసి వీడియో కేవీసీ చేయాల్సి ఉంటుంది.
ఎంటర్ ఎనీ వన్ ఐడి అని అడుగుతుంది ముందు ఇచ్చిన రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ ఓటిపి పై క్లిక్ చేస్తే ఓటిపి వస్తుంది. ఆ వచ్చిన ఓటిపి ని ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి.
యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు వీడియో ఈ కేవైసీ ఎలా చేయాలి?
స్టార్ట్ వీడియో కె.వై.సి పైన క్లిక్ చేయాలి. మన పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్, ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటారు. అలాగే మన సిగ్నేచర్ పేపర్ మీద రాసి వాళ్లకి వీడియోలో మనం చూపించాలి. వెంటనే మన ఈ కేవైసీ ప్రాసెస్ అయిపోతుంది.
వెంటనే ఒక వర్చువల్ క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది. ఫిజికల్ కార్డు అనేది సెవెన్ టు 15 డేస్ లో మీ ఇంటికి డెలివరీ చేస్తారు. కార్డ్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఆ కార్డుని మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ తెలుసుకోవాలి మీకు ఎప్పుడు బిల్స్ జనరేట్ అవుతున్నాయి. ఎంత పేమెంట్ చెల్లించాలి. అని తెలుసుకోవాలి అనుకుంటే యాక్సిస్ బ్యాంక్ మొబైల్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మీ క్రెడిట్ కార్డ్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నుండి ప్రతీ ట్రాన్సాక్షన్ యాప్ లో వెరిఫై చేసుకోవచ్చు.
ఈ విధంగా యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు ను పైన చెప్పిన విధంగా అప్లై చేసుకోవాలి
యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు ను ఆన్లైన్ లో అప్లై చేయడానికి యాక్సిస్ బ్యాంక్ అఫీషియల్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డు ను అప్లై చేసే విధానం ఈ వీడియో లో చూడండి.