Jio Fiber ప్లాన్స్ ఏవిధంగా ఉన్నాయి, ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుంది, పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది.
Jio Fiber లో Two types of Plans అనేవి అవైలబుల్ గా ఉంటాయి. Prepaid ఉంటుంది, అలాగే Post Paid ఉంటుంది.
ఫ్రీ పెయిడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా సిమ్ కి ఎలా రీఛార్జ్ చేస్తాము, వన్ మంత్ ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ కావాలనుకుంటే వన్ మంత్ ముందుగానే రీఛార్జ్ చేసుకుంటాం కదా ఇది ఫ్రీ పెయిడ్.
పోస్ట్ పెయిడ్ ఎలా ఉంటుందంటే, వన్ మంత్ తర్వాత ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ వాడుతుంటాం, వన్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత రీఛార్జ్ చేస్తాం. ఇది Post Paid. ఈ విధంగా జియో ఫైబర్ లో Prepaid ఉంటుంది అలాగే పోస్ట్ పెయిడ్ ఉంటుంది.
ఇన్స్టలేషన్ మరియు ధర ఏ విధంగా ఉంటుంది?
ఇన్స్టలేషన్ విషయానికి వస్తే జియో ఫైబర్ లో ప్రీపెయిడ్ ప్లాన్ లో అయితే ఓన్లీ ఇంటర్నెట్ పర్పస్ కోసం మాత్రమే ఫైబర్ తీసుకోవాలనుకుంటే రూ 1500/- ఉంటుంది.
ఓన్లీ 1500 రూపీస్ రౌటర్ కోసం ఛార్జ్ చేస్తారు లేదా 4k సెటప్ బాక్స్ కావాలి అంటే టీవీ చానల్స్ ఒ.టి.టి కన్నెంటు మొత్తం చూస్తాము అనుకొనే వాళ్ళు అయితే రూ 2500/- extra చార్జ్ అవుతుంది.
So ఈ విధముగా ఇన్సులేషన్ ఛార్జ్ అయితే ఉంటుంది. Jio లో ఈ పోస్ట్ పెయిడ్ లో అయితే ఫ్రీ ఉంటుంది ఎటువంటి ఇన్స్టిలేషన్ చార్జెస్ అయితే ఉండదు.
దాంతోపాటు అడ్వాన్స్ బుక్ చేసుకుంటే ఒక రూ 1000/- పెట్టి బుక్ చేసారనుకోండి.
వాళ్ళు వచ్చి ఇన్సులేషన్ చేస్తే ఆ అమౌంట్ మీరు తీసుకున్న ప్లాన్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది.
ఉదా: వన్ ఇయర్ ప్లాన్ తీసుకున్నారనుకోండి. ఆ ప్లాన్ లో ఈ అమౌంట్ యాడ్ చేసుకుంటారు.
జియో ఫైబర్ లో ప్రీ పెయిడ్ లో ఇన్స్టలేషన్ ఛార్జ్ అయితే ఉంటుంది. అదే పోస్ట్ పెయిడ్ కి ఇన్స్టలేషన్ ఛార్జ్ ఉండదు. ప్లాన్స్ విషయానికి వస్తే జియో ఫైబర్ ప్రీ పెయిడ్ లో అయితే బేసిక్ ప్లాన్ 399/- ప్లాన్ ఉంటుంది. పోస్ట్ పెయిడ్ లో కూడా 399/- ప్లాన్ ఉంటుంది.
ఇంటర్నెట్ స్పీడ్ ఏ విధంగా ఉంటుంది?
ఇది మీకు అప్ టు 30 ఎం.బి.పి.ఎస్ ఇంటర్నెట్ స్పీడ్ వస్తుంది. మీకు అన్లిమిటెడ్ డేటా అనేది వస్తుంది.
అన్లిమిటెడ్ డేటా అంటే 3500 జీబీ దాకా ఇంటర్నెట్ ఫర్ మంత్ కి రావడం జరుగుతుంది.
Jio Post Paid లో 599 ప్లాన్ ఉంటుంది. దీనిలో 850 ప్లస్ టీవీ చానల్స్ రావడం జరుగుతుంది. టీవీ చానల్స్ క్వాలిటీ విషయానికి వస్తే జియో ఫైబర్ ఓటిటి యాడ్స్ బేస్ చేసుకుని టీవీ చానల్స్ రావడం జరుగుతుంది.
ఉదా: స్టార్ మా కావాలనుకోండి హాట్ స్టార్ లో ఉంటుంది అక్కడి నుంచి లైవ్ ఛానల్ రావడం జరుగుతుంది. ఒకవేళ జెమినీ, జెమినీ కామెడీ, జెమినీ మ్యూజిక్ లాంటివి కావాలనుకోండి యాడ్స్ ఫ్రీగా ఇస్తారు కదా అందులో ఉన్న చానల్స్ లో ప్లే అవుతుంది.
టీవీ చానల్స్ విషయానికి వస్తే జియో ఫైబర్ లో ఒక్కొక్కసారి అయితే మీకు లైవ్ ఛానల్ ఓటిటి బేస్ చేసుకుని స్ట్రక్ అవుతుంటాయి.
జియో ఫైబర్ లో అయితే 399/- బేసిక్ ప్లాన్ అనేది ఉంటుంది 399/- రీఛార్జ్ చేస్తే 30 ఎం.బి.పీ.ఎస్ ఇంటర్నెట్ స్పీడ్ రావడం జరుగుతుంది.
జియో ఫైబర్ కోసం ఎలా అప్లై చేయాలి?
Jio Fiber లో ఒక ప్రోబ్లం ఏంటంటే ఎక్కువగా గ్రామాలలో అవైలబుల్ గా లేదు. కొన్ని మేజర్ సిటీల్లో మాత్రమే ఉన్నాయి. సిటీల్లో కొన్ని ఏరియాలో మాత్రమే ఉన్నాయి.
ఎందుకంటే ఇది ఆప్టికల్ కేబుల్ ద్వారా ఉంటాయి. ఈ ఆప్టికల్ కేబుల్ ద్వారా మీ ఇంటికి ఫైబర్ కనెక్షన్ అనేది ఇస్తారు.
కొన్ని ఏరియాల్లో కేబుల్ కనెక్షన్ అయితే ఉండదు. జియో ఫైబర్ లేని గ్రామాలు లేదా పట్టణాలలో జియో ఏయిర్ ఫైబర్ అవైలబుల్ గా ఉంటుంది.
ఇది 5G సిగ్నల్ తో నడుస్తుంది. జియో ఏయిర్ ఫైబర్ కూడా జియో ఫైబర్ ప్లాన్స్ కలిగి వుంటాయి
జియో ఫైబర్ మరియు జియో ఏయిర్ ఫైబర్ కనెక్షన్ ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.