Yono Sbi Login Forgot Password పని చేయడం లేదా! Yono SBI App Uninstall చేసి మల్లి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చినా లేదా యూసర్ నేమ్, పాస్వర్డ్ మరచిపోయినా, Yono SBI App లో ఎలా లాగిన్ అవ్వాలి.
https://www.youtube.com/VenkiTechnology/videos?sub_confirmation=1
Yono SBI App ఎలా లాగిన్ అవ్వాలి?
Yono SBI App ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసాక Register Now పై క్లిక్ చేయాలి. మీ మొబైల్ లో 2 సిమ్ లు ఉన్నట్లైయితే ! మీ Sbi ఎకౌంటు కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందొ ఆ నెంబర్ సిమ్ కి టిక్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. వెంటనే సెకండ్స్ రన్ అవుతాయి.
మీ ఎకౌంటు నెంబర్ అలాగే డేట్ అఫ్ బర్త్ ఇచ్చి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. వెంటనే మీకు ఆల్రెడీ SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ ఉంది అని చూపిస్తుంది. ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి.
మీయొక్క SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ అడుగుతుంది. మీరు యూసర్ నేమ్, లేదా పాస్వర్డ్ లేదా రెండు మరచిపోయినట్లితే ఎలా రీసెట్ చేయాలంటే, మీ మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని సెర్చ్ చేసి SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. లేదా డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Yono Sbi Login Forgot Password
https://www.youtube.com/VenkiTechnology/videos?sub_confirmation=1
వెబ్సైట్ ను ఓపెన్ చేసాక Login పై క్లిక్ చేసి, Continue Login పై క్లిక్ చేయాలి. ఇక్కడ Forgot Username / Login Password పై క్లిక్ చేయాలి. 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. Forgot Username పై క్లిక్ చేయాలి. CIF Number అడుగుతుంది. CIF Number అనేది మీ బ్యాంకు పాస్ బుక్ పై ఉంటుంది. ఆ CIF Number ను ఎంటర్ చేయాలి. అలాగే కంట్రీ దగ్గర ఇండియా సెలెక్ట్ చేయాలి.
అలాగే మీ SBI ఎకౌంటు కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి, దిగువ ఉన్న క్యాప్చ కోడ్ ను బాక్స్ లో టైపు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. వెంటనే మీ మొబైల్ కు OTP వస్తుంది, OTP ని బాక్స్ లో టైపు చేసి Conform పై క్లిక్ చేయాలి. వెంటనే మీ Username అనేది డిస్ప్లే అవుతుంది.
SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ లో పాస్వర్డ్ రిసేట్ ఎలా చేయాలి?
నెక్స్ట్ పాస్వర్డ్ కోసం మరలా SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. వెబ్సైట్ ను ఓపెన్ చేసాక Login పై క్లిక్ చేసి, Continue Login పై క్లిక్ చేయాలి. Forgot Username / Login Password పై క్లిక్ చేయాలి. 4 ఆప్షన్స్ లో Forgot My Login Password పై క్లిక్ చేయాలి. మీ Username అడుగుతుంది. ఆల్రెడీ మీరు రీసెట్ చేసిన Username ను ఎంటర్ చేయాలి.
అలాగే మీ బ్యాంకు ఎకౌంటు నెంబర్, కంట్రీ అలాగే డేట్ అఫ్ బర్త్ ఇవ్వాలి. డేట్ అఫ్ బర్త్ DD/MM/YYYY గా ఇవ్వాలి లేదంటే ఎర్రర్ వస్తుంది. అలాగే దిగువ ఉన్న క్యాప్చ కోడ్ ను బాక్స్ లో టైప్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. వెంటనే మీ మొబైల్ కు OTP వస్తుంది, OTP ని బాక్స్ లో టైపు చేసి Conform పై క్లిక్ చేయాలి.
వెంటనే మీకు 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి.
1st option – Using ATM Card Details – మీ దగ్గర SBI ATM Card, Active లో వుంటే ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
2nd option – Using Profile Password – SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క Profile Password మీకు గుర్తుంటే ఈ Profile Password ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.
3rd option – Reset Your login password with Branch activation ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా బ్యాంకు కి వెళ్ళాల్సి ఉంటుంది.
డెబిట్ కార్డ్ అంటే ATM Card వుంటే గనుక Using ATM Card Details పై టిక్ చేయాలి. వెంటనే మీ ATM Card పైన ఉండే నెంబర్ కనిపిస్తుంది. మీ ATM Card తో నెంబర్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసి, Card ను సెలెక్ట్ చేసి Conform పై క్లిక్ చేయాలి. వెంటనే Debit Card Validation అని వస్తుంది.
దానిలో Card Holder Name దగ్గర మీ పేరు ను ఎంటర్ చేయాలి, Valid Up to / Expiry Date దగ్గర మీ ATM Card పైన ఉండే Expiry MM/YYYY ఎంటర్ చేయాలి అలాగే PIN దగ్గర మీ ATM Card యొక్క 4 డిజిట్ Secret PIN నెంబర్ ను ఎంటర్ చేసి దిగువ ఉన్న క్యాప్చ కోడ్ ను బాక్స్ లో టైపు చేసి Proceed పై క్లిక్ చేయాలి.
వెంటనే Your debit card validation is success అని వచ్చి వెంటనే పేజ్ Redirect అయ్యి New Password క్రియేట్ చేయమని అడుగుతుంది. Enter New Login Password దగ్గర New Password ఏదైనా ఇవ్వండి. క్రింద Instructions ఉంటాయి దాని ఆధారంగా New Password ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దిగువున Conform Password ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
వెంటనే Your Login Password has been reset successfully అని వస్తుంది.
నెక్స్ట్ Yono SBI App ను ఓపెన్ చేసి యూసర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. రిఫరల్ కోడ్ ఫిల్ చేయనవసరం లేదు. దిగువున ఉన్న సబ్మిట్ పై క్లిక్ చేయాలి. వెంటనే మీ మొబైల్ కు OTP వస్తుంది, OTP ని ఇక్కడ ఎంటర్ చేసి దిగువున ఉన్న నెక్స్ట్ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
కొన్ని Terms & Conditions వస్తాయి. దిగువున ఉన్న నెక్స్ట్ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 6 Digits MPIN అనేది సెట్ చేసుకోవాలి. మీకు గుర్తుండే విధంగా 6 Digits MPIN అనేది 2 టైమ్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి.
వెంటనే Congratulations You have successfully registered అనే Popup కనిపిస్తుంది ఓకే పై క్లిక్ చేసిన వెంటనే మీయొక్క Yono SBI లాగిన్ పేజ్ successful గా ఓపెన్ అవుతుంది.
ఈ విధంగా మీరు కుడా Yono SBI App లో successful లాగిన్ చేయగలరు.
పూర్తి వివరాలు Yono Sbi Login Forgot Password వీడియో రూపంలో కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి