1st AC Coach – 2nd AC 1st AC Coach – 3rd AC Coach Differences
ట్రైన్ లో ప్రయాణం అంటే చాలా మంది ఎక్కువుగా ఇష్ట పడుతుంటారు. అయితే ఎక్కువ మంది జనరల్ మరియు స్లీపర్ క్లాస్ లో ప్రయానిస్తుంటారు.
దీనికి గల కారణం AC భోగీ లలో ప్రయాణం ఖరీదైన ప్రయాణం గా చెప్పవచ్చు. AC భోగీ లలో ప్రైస్ వ్యత్యాసం కూడా చాలా ఎక్కువుగా ఉంటుంది.
1st AC Coach:
ట్రైన్లో 1st ఏసీ అనేది – అత్యున్నత క్లాస్ అంటే అత్యంత లక్జరీ క్లాస్ లా వుంటుంది.
దీని ప్రైస్ కుడా ఫ్లైట్ చార్జీలతో సమానం గా ఉంటాయి. ఈ Coach లలో 18 నుండి 24 వరకూ సీట్స్ ఉంటాయి. 1st AC Coach లోపల నీట్ & క్లీన్ గా ఉంటుంది. టాయిలెట్స్ అయితే చాలా శుబ్రంగా ఉంటాయి.
1st ఏసీ కోచ్ లలో ఒక్కో కేబిల్ లో 4 సీట్స్ ఉంటాయి. మనం 4 సీట్స్ బుక్ చేసుకున్నట్లయితే కీ కూడా మనకే ఇచ్చేస్తారు.
డోర్ క్లోజ్ చేసుకొని సెక్యూర్ గా మనం లోపల ఉండవచ్చు. అలాగే కపుల్ సీట్స్ దీనిలో 2 సీట్స్ మాత్రమె వుంటాయి. దీనిలో పైకి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ కుడా ఉంటాయి.
1st ఏసీ కోచ్ లలో side అప్పర్, side లోవర్ సీట్స్ అనేవి ఉండవు. దీనిలో ఒక్కో భోగి కి ఒక్కో అటెండర్ ఉంటాడు. మనకు ఏ అవసరం వచ్చినా అటెండర్ ను అడిగి తెప్పించుకోవచ్చు.
దీనిలో బెడ్ షీట్స్, పిల్లోస్ ఇస్తారు. 1st AC Coach లలో భోజనం, టీ టిఫిన్, స్నాక్స్ వాల్లే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫుడ్ కోసం టికెట్ లో ముందుగానే చార్జ్ చేస్తారు. 1st AC ప్రయాణం అనేది కాస్త ఖరీదైన ప్రయాణం గా మనం చెప్పుకోవచ్చు.
ప్రైవసీ మరియు సెక్యూర్ గా ప్రయాణం చేయాలనుకునేవారు. 1st AC Coach ని ప్రిఫర్ చేయవచ్చు.
2nd AC 1st AC Coach:
2nd AC Coach లలో side అప్పర్, side లోవర్ సీట్స్ కూడా ఉంటాయి. Coach మొత్తం 40 సీట్స్ వరకూ ఉంటాయి. ఒక్కో సెక్షన్ లో 4 సీట్స్ మాత్రమె ఉంటాయి. కాని సెపరేట్ క్యాబిన్ అనేది 2nd AC లో ఉండదు. దీనిలో కూడా బెడ్ షీట్స్, పిల్లోస్ ప్రోవైడ్ చేస్తారు.
2nd AC భోగీ లలో సీట్స్ మద్యలో ఇలా కర్టైన్స్ అనేవి వుంటాయి. దీనిలో కూడా అటెండర్ ఉంటాడు. మనకు ఏ అవసరం వచ్చినా అటెండర్ ను అడగవచ్చు.
3rd AC Coach:
3rd AC Coach – స్లీపర్ క్లాస్స్ లో ఏ విధంగా సీట్స్ ఉంటాయో same అలానే దీనిలో కూడా ఉంటాయి. కాకుంటే ac మాత్రమే దీనికి ఎడిషనల్.
3rd AC Coach లలో 64 నుండి 70 వరకూ సీట్స్ ఉంటాయి. ఒక్కో సెక్షన్ లో 6 సీట్స్ ఉంటాయి. దీనిలో మిడిల్ బెర్త్ అనేది అదనంగా ఉంటుంది. దీనిలో కూడా బెడ్ షీట్స్, పిల్లోస్ ప్రోవైడ్ చేస్తారు.
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలి ac లో ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం 3rd క్లాసు AC బెస్ట్ అని చెప్పవచ్చు.
వైజాగ్ నుండి సికింద్రాబాద్ కు ప్రస్తుతం ఎక్ష్ప్రెస్స్ train టికెట్ ప్రైస్ ఏ విధంగా వుందంటే?
1st AC ఒక్కొక్కరికి 2465 /- గా వుంది , 2nd AC లో ఒక్కొక్కరికి 1470/- గా వుంది , 3rd AC లో ఒక్కొక్కరికి 1030/- గా వుంది. అదే స్లీపర్ క్లాస్ లో అయితే 380/- గా వుంది.
Train టికెట్ మరియు తత్కాల్ టికెట్ ను మొబైల్లో ఎలా బుక్ చేయాలి అనే సందేహం వుంటే ఈ క్రింది వీడియో లో చూడండి.
Train Ticket Booking Process Video: https://youtu.be/Eq9fGBLgAsM
Tatkal Ticket Booking Process Video: https://youtu.be/FxkJfIDvkpU